Sunday, February 26, 2017

The essence of nature

నిశబ్దంలో శబ్దం
ఒంకారంగా మారింది
సాగరంలో కలవరం
గుబులుగా మారింది
ఈ విశాల విశ్వంలో
ఒక చిన్న రేణువు
తనదైన శైలిలో
కంఠం విప్పింది
ఈ అనంత వాయువులో
ఒక పిల్ల తెమ్మర
తనదైన రీతిలో
దోబూచులాడింది
ప్రకృతి మెల్లగా
పురివిప్పి నాట్యమాడింది
మూసియున్న నా కళ్ళలో

జగత్తు ఇమిడిపోయింది

No comments:

Post a Comment