Tuesday, March 28, 2017

                                                                   Who are you?

నీవు ఎవరు?నీకు ఎవరు?
ఏది అవును ఏది కాదు?
ఏది నీవు ఏది నేను?
ఏది నిత్యం ఏది సత్యం?
ఏది కల ఏది ఇల?
నిన్న నిజం నేడు కాదు
నేటి నిజం రేపు కాదు
మారుటయే సత్యము
కాలము అనిత్యము
మరి నీవెవ్వరు? నీకెవ్వరు?
నీవెవ్వరో నీకు తెలిస్తే
ఇక నీవన్నదే లేదుగా!
నువ్వు, నేను, మేము
ఇక ఏ మాత్రం లేవుగా!
సృష్టికర్త రచనలోని
చిన్న చిన్న పదాలం
అనంతమైన విశ్వంలో
కరిగిపోయే క్షణాలం
తెలుసుకో నేస్తమా!

ఆ నీవిదని తెలుసుకో!