Sunday, February 26, 2017

The essence of nature

నిశబ్దంలో శబ్దం
ఒంకారంగా మారింది
సాగరంలో కలవరం
గుబులుగా మారింది
ఈ విశాల విశ్వంలో
ఒక చిన్న రేణువు
తనదైన శైలిలో
కంఠం విప్పింది
ఈ అనంత వాయువులో
ఒక పిల్ల తెమ్మర
తనదైన రీతిలో
దోబూచులాడింది
ప్రకృతి మెల్లగా
పురివిప్పి నాట్యమాడింది
మూసియున్న నా కళ్ళలో

జగత్తు ఇమిడిపోయింది

Poem -3

ఏదో చెప్పాలని ఉంది....
అది భాషకు అతీతంగా ఉంది
భావమేమో తీవ్రంగా ఉంది
ఉప్పొంగి పొంగి పొరులుతుంది
మాటలకేమో అందకుంది
మనుగడనేమో శాసిస్తుంది
ఏదో రగులుతుంది
బడబాగ్నై పొంగుతుంది
కడకేదో అవుతుంది
అదియేదో తెలియకుంది
ఏదో చెప్పాలనుంది....
శివగంగై దుముకుతుంది
ఆ ఖేదము ఈ నాదము
ఆ శ్లేషము ఈ క్లేశము
హృదయమేమో లయ తప్పే
జీవనమేమో గతి తప్పే
ఎటు పోతున్
ఎటులీతున్ (ఎటులీదుతున్)
ఈ మహాసాగరమ్మున్
ఈ ఘోషణ ఈ భీషణ
సంగ్రామమున్ పరమశివా! 
ఇలా కాదు అలా కాదు
అని వెతికి వెతికి వేసారి
అలా ఇలా ఎలా కాని
మహేశరుని దరి చేరి
సదా శివా నీవే శివా
సదా నాకు తోడనుచు
సకల ప్రాణులందరికీ
నీవె కదా దిక్కనుచు
అహం వీడి ఇహం మరచి
శివ నామమే స్మరయించుచు
శివునిలోన లీనమాయె

ధన్యమాయె జీవితంబు

Saturday, February 25, 2017

Poem -2

ఏదో చెప్పాలని ఉంది....
అది భాషకు అతీతంగా ఉంది
భావమేమో తీవ్రంగా ఉంది
ఉప్పొంగి పొంగి పొరులుతుంది
మాటలకేమో అందకుంది
మనుగడనేమో శాసిస్తుంది
ఏదో రగులుతుంది
బడబాగ్నై పొంగుతుంది
కడకేదో అవుతుంది
అదియేదో తెలియకుంది
ఏదో చెప్పాలనుంది....
శివగంగై దుముకుతుంది
ఆ ఖేదము ఈ నాదము
ఆ శ్లేషము ఈ క్లేశము
హృదయమేమో లయ తప్పే
జీవనమేమో గతి తప్పే
ఎటు పోతున్
ఎటులీతున్ (ఎటులీదుతున్)
ఈ మహాసాగరమ్మున్
ఈ ఘోషణ ఈ భీషణ

సంగ్రామమున్ పరమశివా!  

The Poem

ఏదో చెప్పాలని ఉంది....
అది భాషకు అతీతంగా ఉంది
భావమేమో తీవ్రంగా ఉంది
ఉప్పొంగి పొంగి పొరులుతుంది
మాటలకేమో అందకుంది
మనుగడనేమో శాసిస్తుంది
ఏదో రగులుతుంది
బడబాగ్నై పొంగుతుంది
కడకేదో అవుతుంది
అదియేదో తెలియకుంది

ఏదో చెప్పాలనుంది....
నీ కేం తెలుసు నా గుండె ఎంత క్షోభిస్తుందో! గుండెలో గాయం చేసి ఆనందించే ఓ మహామనిషీ! ఓ పుణ్యపురుషుడా! ఓ పురుషపుంగవుడా! రగిలే గుండె క్షోభ నీవెరుగుదవా? మనసనేది ఒక వస్తువనుకునే నీకు దాని విలువ ఏనాటికైనా అర్ధం అవుతుందా? ఈ చిన్నపాటి జీవితంలో మంచితనానికి, మానవత్వానికి, ప్రేమతత్వానికి అర్ధం తెలియకుండా జీవించే నీ జీవితానికి ఒక అర్ధం ఉందా? ఎంత నటించగలవు? ఎంత గొప్ప నటుడివి? మహా మహులు సినిమాలలో రంగస్థలాలలో నటించి ప్రేక్షకులను అలరిస్తారు. మరి నువ్వు? నువ్వు నిజ జీవితంలో ప్రేమ, పెళ్ళి అనే నాటకాలను మహా అధ్భుతంగా ఆడి, నిలువునా దగా చేస్తావు. ఓ మోసగాడా, నీకు హృదయం లేదు. మనసు లేదు. నీ అంతటి స్వార్ధపరుడిని నేను తొలుత చూడలేదు. కాని ఏకంగా నీ బాన పడ్డాను. ఎందుకంటే అందరు చెడ్డవాళ్ళ వలె నువ్వు కూడా నీ చెడుని బయటకు కనిపించనివ్వవు. చెడే నువ్వైనా మంచివాడిగా అధ్భుతంగా నటిస్తావు. కాదు కాదు. నటనలో జీవిస్తావు. నిండు జీవితాలను ముంచేస్తావు. ఓ ద్రోహీ! నీ వంటి వారికి సమాజం ఏ శిక్షా వేయదు. వేయలేదు. ఎందుకంటే నువ్వు సమాజాన్ని, సంఘాన్ని బహుశా దేవుడిని కూడా బోల్తా కొట్టించగల మహా ప్రతిభాపాటవాలు ఉన్న మేక వన్నె పులివి. నిన్ను నమ్మిన వారికి ఇవిగో నా కన్నీటిబొట్లు అర్పిస్తున్నాను. ఎందుకంటే  అంతకన్నా ఏమైనా చేయడం ఎవరి వల్లా కాదు. మరి నా వంటి ఒక అతి సామాన్యమైన ఒక మనిషి ఏం చేయగలదు!!!