ఏదో చెప్పాలని ఉంది....
అది భాషకు అతీతంగా ఉంది
భావమేమో తీవ్రంగా ఉంది
ఉప్పొంగి పొంగి పొరులుతుంది
మాటలకేమో అందకుంది
మనుగడనేమో శాసిస్తుంది
ఏదో రగులుతుంది
బడబాగ్నై పొంగుతుంది
కడకేదో అవుతుంది
అదియేదో తెలియకుంది
ఏదో చెప్పాలనుంది....
శివగంగై దుముకుతుంది
ఆ ఖేదము ఈ నాదము
ఆ శ్లేషము ఈ క్లేశము
హృదయమేమో లయ తప్పే
జీవనమేమో గతి తప్పే
ఎటు పోతున్
ఎటులీతున్ (ఎటులీదుతున్)
ఈ మహాసాగరమ్మున్
ఈ ఘోషణ ఈ భీషణ
సంగ్రామమున్ పరమశివా!
ఇలా కాదు అలా కాదు
అని వెతికి వెతికి వేసారి
అలా ఇలా ఎలా కాని
మహేశరుని దరి చేరి
సదా శివా నీవే శివా
సదా నాకు తోడనుచు
సకల ప్రాణులందరికీ
నీవె కదా దిక్కనుచు
అహం వీడి ఇహం మరచి
శివ నామమే స్మరయించుచు
శివునిలోన లీనమాయె
ధన్యమాయె జీవితంబు
No comments:
Post a Comment